Saturday, January 18, 2025

ఇంకా స్టార్‌ను కాలేదు:అనన్య పాండే

- Advertisement -
- Advertisement -

యంగ్ బ్యూటీ అనన్య పాండే బాలీవుడ్ లో దాదాపు ఐదారేళ్లగా సినిమాలు చేస్తోంది. అయితే ఇంకా తాను స్టార్ అనే ట్యాగ్‌కి అనర్హురాలని ఆమె పేర్కొంది. “18 ఏళ్ల వయసులోనే నటించడం మొదలు పెట్టాను. అప్పుడే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. అయినా వెనకడుగు వేయకుండా పరిశ్రమలో కొనసాగాను. ఇన్నేళ్ల కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దక్కుతుంద నిపిస్తుంది. ప్రేక్షకులు ఇప్పుడే నా పనితనాన్ని గుర్తిస్తున్నారు.

అందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఒకప్పుడు ప్రముఖ నటుల్ని మాత్రమే స్టార్ అని పిలిచేవారు. కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా స్టార్లు ఎక్కువయ్యారు. నేను స్టార్‌గా ఉండాలనుకుంటున్నా. కానీ అందుకు ఇంకా సమయం పడుతుంది. అలాగని సోషల్ మీడియా స్టార్ అని పిలిపించుకోవడం ఇష్టం లేదు. స్టార్ అంటే అసలైన స్టార్ గానే కనిపించాలి” అని అనన్య చెప్పింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News