Sunday, December 29, 2024

ప్లమ్‌ బాడీలవిన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా అనన్య పాండే

- Advertisement -
- Advertisement -

Ananya Pandey Signs as brand Ambassador of Plum Bodylovin

ముంబై: ప్లమ్‌ బాడీ లవిన్‌–ప్లమ్‌ అత్యంత ప్రియమైన బాత్‌ అండ్‌ బాడీ బ్రాండ్‌ తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ నటి, స్టైల్‌ ఐకన్‌ అనన్యపాండేను ఎంపిక చేసుకున్నారు. ఈ సితార ‘ఫేస్‌ ఆఫ్‌ ది బ్రాండ్‌’ గా ఫ్రాగ్రాన్స్‌ విభాగంలోని బాడీ మిస్ట్స్‌, ఫర్‌ఫ్యూమ్స్‌ మరియు డియోడరెంట్స్‌లను పలు మాధ్యమాల ద్వారా ప్రచారం చేయనున్నారు. బాత్‌ అండ్‌ బాడీ ‘బ్రాండ్‌ ఆఫ్‌ చాయ్స్‌’ గా యువ భారతం కోసం నిలువాలన్నది ప్లమ్‌ బాడీ లవిన్‌ లక్ష్యం. ఈ బ్రాండ్‌లో అత్యంత వినోదాత్మకమైన మరియు ఆహ్లాదకరమైన సిగ్నేచర్‌ ఫ్రాగ్నాన్స్‌ అయినటువంటి హవాయియన్‌ రంబి, వన్నిల వైబ్స్‌, ట్రిప్పిన్‌ మిమోసాస్‌ మరియు ఆర్కిడ్‌–యు–నాట్‌ ఉన్నాయి. అనన్య పాండే నేటి యువ మహిళలకు తనతో పాటు ఆకర్షణ మరియు ఉల్లాస భరితమైన సమ్మేళనాన్ని తీసుకువచ్చారు! ఇది అనన్య వ్యక్తిత్వం మరియు బ్రాండ్‌ డీఎన్‌ఏ నడుమ ఒక సహజ సంబంధం కుదిర్చింది. ఈ ప్రకటన గురించి ప్లమ్‌ సీ.ఈ.ఓ. , కో–ఫౌండర్‌ శంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘నేడు భారతదేశంలో యూత్‌ ఐకాన్‌లలో ఒకరు కావడంతో పాటు, భవిష్యత్‌ తారగా వెలుగొందుతున్న నటీమణులలో ఒకరైన అనన్య పాండేను సైన్‌ చేసుకోవడం పట్ల సంతోషంగా ఉంది. అనన్య యొక్క సంతోషకరమైన వ్యక్తిత్వం, డైనమిజం, ఖచ్చితంగా ప్లమ్‌ బాడీలవిన్‌ బ్రాండ్‌ వ్యక్తిత్వంతో కుదురుతుంది. అనన్య ప్లమ్‌ బాడీ లవిన్‌తో కలవడం, భారతదేశంలో ఈ బ్రాండ్‌ను ప్రిఫర్డ్‌ చాయ్స్‌ చేయడంలో ముందడగు వేయడానికి అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాము’’.తను బ్రాండ్‌ అంబాసిడర్‌ కావడంపై నటి అనన్య పాండే మాట్లాడుతూ ‘‘ప్లమ్‌ బాడీ లవిన్‌కు చెందిన వినూత్నమైన బాడీ మిస్ట్స్‌, పెర్‌ఫ్యూమ్స్‌, రంగు రంగుల డిజైన్లు మరియు ఆహ్లాదకరమైన పేర్ల కలిగిన– హవాయియన్‌ రుంబ, ఆర్చిడ్‌ యు–నాట్‌ మొదలైనవి ఆనందాన్ని కలిగించనున్నాయి.

ఎల్లప్పుడూ చక్కటి సువాసనలు కోరుకుంటూ, అన్ని విషయాలలోనూ వినోదాత్మకంగా ఉండాలనుకునే వ్యక్తిగా నేను ప్లమ్‌ అంబాసిడర్‌ కావడం ఎంతో ఆనందం కలుగుతుంది.జంతువుల పట్ల నా ప్రేమలాగానే, ఈ బ్రాండ్‌ కూడా 100% వేగన్‌ మరియు క్రూయల్టి ఫ్రీ కావడం ఎంతో నచ్చింది.’’ వివిధ రకాల ప్రాగ్నాన్స్‌– బ్లీచీ, ఫ్లోరల్‌, ఫ్రూటీమస్కీ– ఇలా ఏడు గొప్ప ఫ్రాగ్నాన్స్‌లతో కూడిన 25కు పైగా ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. త్వరలోనే మరిన్ని ఆవిష్కరణలు చేయనున్నారు.

ప్లమ్‌ బాడీలవిన్‌ ఇప్పుడు వైవిధ్యమైన మరియు నాణ్యమైన ఫ్రాగ్నాన్స్‌లను గతంలో భారతీయ మార్కెట్‌ ఎన్నడూ చూడని రీతిలో అందించనుంది. ఇప్పటికే ఈ బ్రాండ్‌, ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లో కూడా అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది. ప్లమ్‌ బాడీలవిన్‌ ఇప్పటికే తమ ఆన్‌లైన్‌ కార్యకలాపాలు విస్తరించడంతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ కార్యకలాపాలు, కియోస్క్‌లు మరియు ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ ఔట్‌లెట్లుతో విస్తరిస్తోంది. ఇప్పటికే బ్రాండ్‌కు 1100కు పైగా అసిస్టెడ్‌ మరియు 10000కు పైగా అన్‌అసిస్టెడ్‌ ఔట్‌లెట్లు ఉన్నాయి.

Ananya Pandey Signs as brand Ambassador of Plum Bodylovin

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News