Wednesday, January 22, 2025

జలసీ పాత్రలో అనసూయ

- Advertisement -
- Advertisement -

అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అరి’. ఈ చిత్రాన్ని ఆర్వీ రెడ్డి సమర్పణలో అర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. పేపర్ బాయ్ సినిమా ద్వారా ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జయశంకర్ రూపొందిస్తున్నా రు. ఈ సినిమాలోని ఒక్కో పాత్రను తెలియచేస్తున్నారు. ఈ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్స్, వాటి పేర్లు వైవిధ్యంగా ఉండి సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి. జలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్‌గా సాయి కుమార్, ఆంగర్ క్యారెక్టర్‌లో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్‌గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్‌మెంట్ క్యారెక్టర్‌లో సురభి ప్రభావతి నటిస్తున్నారు. వీరి క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్ కొత్త గా ఉన్నాయి. మనిషి ఎలా బతకకూడదు? అనే విషయాన్ని ఈ సిని మా ద్వారా ఆసక్తికరంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News