Wednesday, January 22, 2025

‘పెదకాపు1’లో నా పాత్ర చాలా స్ట్రాంగ్: అనసూయ

- Advertisement -
- Advertisement -

యంగ్ ట్యాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి అనసూయ భరధ్వాజ్ విలేకరుల సమావేశంలో ‘పెదకాపు-1’ విశేషాలని పంచుకున్నారు.

పెదకాపు1 లో మీ పాత్ర ఎలా వుంటుంది ?
‘పెదకాపు’లో చాలా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాను. ఇప్పుడే ఆ పాత్ర పేరు, స్వభావం గురించి పూర్తిగా చెప్పకూడదు. ప్రేక్షకులు పెదకాపు వరల్డ్ తో ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. సినిమా చూసిన తర్వాత నా పాత్ర ఇంకా ఇంపాక్ట్ ఫుల్ గా వుంటుంది. ఇందులో నా పేరు నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా నచ్చింది. సినిమా విడుదల తర్వాత అందరూ ఆ పేరుతోనే పిలుస్తారనే నమ్మకం వుంది.

రంగస్థలంలో రంగమ్మత్త తర్వాత మళ్ళీ అలాంటి పాత్ర మీ నుంచి రాలేదనిపిస్తుందా?
రంగస్థలంలో రంగమ్మత్తగా నన్ను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. ఆ పాత్ర ఒక బార్ ని సెట్ చేసింది. ఐతే నేను మాత్రం విభిన్నమైన పాత్రలు చేయడానికి నా వంతుగా ప్రయత్నిస్తున్నాను. ‘విమానం’లో సుమతి పాత్రలో విభిన్నంగా కనిపించాను. ఇప్పుడు పెదకాపులో చేసిన పాత్ర కూడా చాలా బలంగా, వైవిధ్యంగా వుంటుంది. పెదకాపు చాలా రా ఫిల్మ్. నా పాత్రలో కొన్ని బోల్డ్ డైలాగ్స్ కూడా వున్నాయి.

ఈ సినిమాలో మిమ్మల్ని డీవోపీ ఛోటా కె నాయుడు గారు రిఫర్ చేశారని విన్నాం?
అవును. సందీప్ కిషన్ ‘మైఖేల్’ సినిమాలో చేశాను. ఆ సినిమా చూసి ఛోటా గారు ఫోన్ చేశారు. ‘’నీకొక ఫోన్ వస్తుంది. ఆ పాత్ర చేయమని చెప్పను కానీ కన్సిడర్ చేయ్’’అని చెప్పారు. శ్రీకాంత్ గారు ఈ కథ చెప్పిన తర్వాత తప్పకుండా ఇలాంటి మంచి సినిమాలో భాగం కావాలని నిర్ణయించుకున్నాను. ప్రగతి, బ్రిగడ, ఈశ్వరీరావు..ఇలా ఇందులో స్త్రీ పాత్రలన్నీ చాలా బలంగా వుంటాయి.

శ్రీకాంత్ అడ్డాల గారి నుంచి ఇలాంటి కథని ఊహించారా ?
అస్సల్ లేదండీ. శ్రీకాంత్ గారంటే .. సీతమ్మ వాకిట్లో, బ్రహ్మోత్సవం.. ఇలాంటి హోమ్లీ ఇంప్రెషన్ వుంటుంది. అలాంటి శ్రీకాంత్ గారు పెదకాపు లాంటి కథ చెప్పినపుడు షాక్ అయ్యా. దర్శకుడిగా ఆయనకి ఇది చాలా డిఫరెంట్ ట్రాన్స్ ఫర్మేషన్.

శ్రీకాంత్ గారు ఇందులో నటించడం ఎలా అనిపించింది ?
నిజంగా ఇది బిగ్ సర్ ప్రైజ్. కథ విన్నప్పుడు శ్రీకాంత్ గారు నటిస్తున్నారని నాకు తెలీదు. నిజానికి ప్రతి దర్శకుడిలో ఒక నటుడు వుంటారు. ఇలా చేయాలని మొదట చేసి చూపించేది దర్శకులే. శ్రీకాంత్ గారు చాలా యీజ్ తో ఆ పాత్రని చేశారు. ప్రేక్షకులు కూడా సర్ ప్రైజ్ అవుతారు.

ఇందులో మీ పాత్ర కోసం ప్రత్యేకమైన మేకోవర్ అయ్యారా ?
పెదకాపులో ప్రతి పాత్రని చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రతి పాత్రకు ఒక మేకోవర్ వుంది. మేకోవర్ లో ఎన్ని రకాలు ఉంటాయో ఈ సినిమా చేసేటప్పుడు నేర్చుకున్నాను. ఈ సినిమా చాలా మంచి అనుభవం.

కొత్త హీరో విరాట్ కర్ణ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
విరాట్ కర్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. షూటింగ్ లో చాలా దెబ్బలు కూడా తగిలాయి. తనది చాలా మంచి మనస్తత్వం. ఇందులో తన పాత్ర చాలా ఫెరోషియస్ గా వుంటుంది. ట్రైలర్ చూసిన చాలా మంది తనని ప్రభాస్ గారి తో పోల్చారు. ప్రభాస్ గారంటే విరాట్ కి చాలా ఇష్టం. విరాట్ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకముద్ర వేసుకుంటాడనే నమ్మకం వుంది.ఇందులో ప్రతి పాత్రతో నాకు కాంబినేషన్ సీన్లు వున్నాయి. ప్రతి పాత్ర కథలో కీలకంగా వుంటుంది.

నిర్మాతలు గురించి ?
ద్వారక క్రియేషన్స్ నాకు ఇష్టమైన నిర్మాణ సంస్థలలో ఒకటి. మిర్యాల రవీంద్రరెడ్డి గారు ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు.
ఇందులో నేను చేసిన పాత్ర కోసం మిగతా భాషల నుంచి కూడా కొందరిని అనుకున్నారు. అలాంటి బలమైన పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాననే తృప్తి వుంది.

ఎలాంటి పాత్రలు చేయాలని భావిస్తున్నారు ?
అన్ని రకాల పాత్రలు చేస్తాను. అమ్మమ్మ పాత్ర కూడా చేస్తాను. ఐతే ఆ పాత్ర చూసిన తర్వాత అమ్మమ్మ గురించి మాట్లాడుకునేలా వుండాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News