- Advertisement -
యంగ్ హీరో విరాట్ కర్ణ హైలీ యాంటిసిపేటెడ్ పాన్ -ఇండియా మూవీ ‘నాగబంధం’. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్ స్కేల్‌లో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ అనసూయ భరద్వాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్న ఆమె ఫోటోను సెట్స్ నుంచి షేర్ చేశారు. ఈ ఫోటోలో అనసూయ ఎంతో అందంగా కనిపిస్తోంది. ‘ది సీక్రెట్ ట్రెజర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘నాగబంధం’ ఒక ఎపిక్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్ నామా కథ, స్క్రీన్‌ప్లే రెండింటికీ తనదైన విజన్‌ను తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లు. నాగబంధం సినిమా ఈ ఏడాదిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కానుంది.
- Advertisement -