- Advertisement -
హైదరాబాద్: అనసూయ భరద్వాజ్ పోస్ట్స్ సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతుంటాయి. బుల్లి తెరకు గుడ్ బై చెప్పి వెండితెరపై హంగామా చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 లో నటిస్తుంది. తాజా ఇంటర్వ్యూలో అనుసూయ పలు విషయాలు పంచుకుంది. తన అత్తగారిది బీహార్ అని, అక్కడ సంప్రదాయలు కూడా ఎక్కువని పది మందిలో ఉన్నప్పుడు కొంగు కప్పుకుని ఉండాలని, తనకు పిల్లలంటే చాలా ఇష్టం అని అన్నారు. తనకు ఆడపిల్లలను కనాలని ఉందని అత్తగారికి సిగ్గు విడిచి చెప్పానన్నారు. తన మాట వినగానే తనపై అత్తగారు కోప్పడ్డారని తెలిపింది. నాకు అమ్మాయిని కనాలనీ ఉంది కానీ నా భర్త సహకరించడం లేదంటూ బోల్డ్ గా చెప్పింది. అనసూయ కామెంట్లు విన్న నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
- Advertisement -