హైదరాబాద్: తనకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో నటి అనసూయ చాలా యాక్టివ్‌గా ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో నెటజన్ల కామెంట్ల తనదైన స్టైల్‌లో సమాధానం చెబుతుంటారు. విజయ్ దేవరకొండను కోట్ చేస్తూ అనసూయ పేరును కార్తీక్ అనే నెటిజన్ ఎక్స్ లో లాగడంతో ఆమె అతడిపై మండిపడింది. కార్తీక్ ఎందుకు తన పేరును ప్రతీసారి ప్రస్తవనకు తీసుకొస్తావని కడిగేసింది. తాను కూడా తెలంగాణ బిడ్డనే అని, తన సింపథీ అక్కర్లేదని, దేవుడిపై నమ్మకంతో పాటు తనపై కూడా ఉందని, తన తల్లిదండ్రులు తనకిచ్చిన విలువలు, పెంపకంతోనే పెరిగానని, ఎప్పుడూ తమ విలువలను దిగజారనివ్వను అని అనసూయ ఘాటుగా సమాధానమిచ్చారు. తనని స్వార్థానికి వాడుకున్న తాను ఆశ్చర్యపోలేదని, తనకు, వాళ్లకు ఎటువంటి సంబంధం లేదని, నీకు నాకు చుట్టరికం ఉందా? అని అడిగింది. నీకు నేను అంటీని ఎలా అవుతానని అనసూయ ప్రశ్నించింది. తెలియని వాళ్లతో బంధుత్వం ఉండదని, చుట్టాలు అయితేనే పలకరింపులు బంధుత్వాలు, బంధాలు ఉంటాయని పెద్దవాళ్లు నేర్పించారని పేర్కొంది. తనని టార్గెట్ చేస్తున్న వారికి కూడా మంచి జరగాలని కోరుకున్నారు. అనసూయ రజాకార్ సినిమాలో పోచమ్మగా నటించి అందరినీ అలరించారు. అల్లు అర్జున నటిస్తున్న పుష్ఫ2లో దాక్షాయణిగా ఆమె నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మీతో చుట్టరికం లేదు… నేను మీకు ఆంటీని కాదు: అనసూయ
- Advertisement -
- Advertisement -
- Advertisement -