Friday, December 27, 2024

‘పుష్ప 2’ నుంచి అనసూయ ఫస్ట్ లుక్ విడుదల

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ‘పుష్ప 2ః ది రూల్’ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఆగస్టు 15న దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. పుష్ప పుష్ప అంటూ సాగే పాటతో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బన్నీ హుక్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ క్రేజీ సాంగ్‌కు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడంలో నెటిజన్లు ఇంకా బిజీగానే ఉన్నారు. అయితే బుధవారం అనసూయ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో అనసూయ భీకరంగా కనిపించింది. అనసూయ ఫోజును చూస్తుంటే ఆమె ఎవరినో ఆజ్ఞాపిస్తున్నట్లు ఉంది. మొత్తానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ లో అనసూయ దాక్షాయణి గా కనిపించబోతుంది. ఇంతకీ పుష్ప రాజ్ పై దాక్షాయణి పగ తీర్చుకుంటుందా, లేదా?, ఆమె భర్త మంగళం శ్రీను(సునీల్) ఏమయ్యాడు? వీటికి సమాధానాలు తెలియాలంటే ప్రేక్షకులు ఆగస్టు 15 వరకు ఆగక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News