Monday, January 27, 2025

కామెడీ ఎంటర్‌టైనర్‌లో అనసూయ…

- Advertisement -
- Advertisement -

ఇటీవల ‘పుష్ప’ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న హాట్ యాంకర్ అనసూయ జయశంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్లుగా ఈ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఒక డిఫరెంట్ కామెడీ లవ్ ట్రాక్‌తో ఈ సినిమా నడుస్తుందని.. సినిమా పూర్తిగా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ తో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలోని కీలక పాత్రల్లో శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్రలు కనిపించబోతున్నారు. లేడీ లీడ్ రోల్‌ను అనసూయ చేయబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ సినిమాపై పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఆమె కామెడీ ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందంటూ యూనిట్ సభ్యులు నమ్మకంతో వున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలో అనసూయ కనిపించబోతుంది. ఇది ఒక విభిన్నమైన ప్రేమ కథ అని సమాచారం.

Anasuya play lead role in Comedy Entertainer

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News