Thursday, December 26, 2024

కేన్స్‌లో భారత నటి తళుక్కు

- Advertisement -
- Advertisement -

77వ కాన్స్ చలన చిత్రోత్సవంలో భారతీయ స్టార్లు మ్యాజిక్ సృష్టిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖుల నుంచి ఫ్యాషన్ ప్రభావశీలుర వరకు ఎంతో మంది స్టార్లు ఎర్ర తివాచీపై నడిచారు. భారత్‌కు మరొక గర్వకారణ వార్త చోటు చేసుకుంది. భారతీయ నటి అనసూయా సేన్ గుప్తా ‘కాన్స్ చలన చిత్రోత్సవ్ 2024’లో దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఆమె కాన్స్ చరిత్రలోనే కాన్స్ చలన చిత్రోత్సవ్‌లో ఒక అవార్డు గెలుచుకున్న తొలి నటి అయ్యారు. ‘ది షేమ్‌లెస్’ (2024)లో నటనకు గాను ఆమె ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు.

ఈ చిత్రానికి కాన్‌స్టాంటిన్ బొజనోవ్ దర్శకత్వం వహించారు. చిత్రంలో ఒక సెక్స్ వర్కర్ పాత్రను అనసూయ పోషించారు. ఆమె ఒక పోలీస్‌ను హత్య చేసి వ్యభిచార గృహానికి పారిపోతుంది. అనసూయ ఒక ప్రొడక్షన్‌డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఫేస్‌బుక్‌లో ఆమె చిత్రాన్ని చూసి ఈ చిత్రానికి ఆడిషన్ కోసం పిలిచారు. వాస్తవానికి నటి మిత్రురాలు ఒకరు ఆమె ప్రతిభను గమనించి ఆడిషన్‌కు ఆమె పేరు ప్రతిపాదించారు. ‘ది షేమ్‌లెస్’లో రేణుకగా అనసూయ ప్రదర్శన ఆమెకు ఈ ఘనత సాధించింది. నటి అద్భుత విజయానికి చిత్ర బృందం అంతా వేడుక చేసుకుంటున్నది. అనసూయ స్వస్థలం కోల్‌కతా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News