Saturday, December 21, 2024

ఆధునిక మానవుడి పూర్వీకుడిపై అనుమానాలు?

- Advertisement -
- Advertisement -

ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిణామ శాస్త్ర పరిశోధనలను ఆలోచింప చేసే, ఆధునిక మానవుడు ఒకే ఒక మూలం నుండి రాలేదని చెప్పే నూతన పరిశోధన ఫలితాలు ఇటీవల నేచర్ జర్నల్‌లో ప్రచురితం కావడంతో పరిణామ వాదులు ఆశ్చర్యంతో ఈ ఫలితాల మీద ఉత్సుకతను చూపుతున్నారు.ఈ పరిశోధన పరిణామ మూలాలను బయటకు తీసుకు వచ్చే దిశలో వున్నట్లు తెలుస్తుంది. ఆధునిక మానవుడు కోతి (ప్రైమేట్స్) నుండి వచ్చి ఉంటాడు అని డార్విన్ తన జాతుల ఉత్పత్తి గ్రంధంలో పొందుపరిచాడు. ప్రైమేట్స్ నుండి మానవుడు మారడం ఎవరూ చూడకపోయినా కొన్ని శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా పరిణామం ఇలా జరిగి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు అనేక పరిణామ సిద్ధాంతాల ద్వారా వివరించారు.

కాని ఇటీవల అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, అంత్రపాలజీ విభాగానికి చెందిన బ్రేన్నా ఎం. హేన్ పరిశోధన పరిణామ మూలాలను మార్చే దిశగా వున్నట్లు కనబడుతుంది. ఈ పరిశోధన ఫలితాలు ఇటీవల (మే 17) నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
కొన్ని మిలియన్ల సంవత్సరాలనుండి జరుగుతున్న మార్పులను చెప్పడానికి ఇప్పటి పరిశోధనలు పూర్తీ న్యాయం చేయలేవని తేల్చి చెప్పేశారు. ఈ పరిశోధన ఫలితాలతో మానవుడు కోతి నుండి వచ్చాడన్న డార్విన్ సిద్ధాంతంపై కూడా మరిన్ని పరిశోధనలు అవసరం అని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆఫ్రికా నుండి వచ్చిన ఒకే పూర్వీకుల సమూహం నుండి ఆధునిక మానవుడు వచ్చాడని అందరూ నమ్ముతున్నారు. ఒక కొత్త అధ్యయనం ఇప్పుడు పరిణామ కథలో కొత్త మలుపును ప్రవేశపెట్టింది. ఆధునిక మానవులు ఖండం అంతటా విలీనం కావడానికి ముందు ఆఫ్రికాలో వ్యక్తిగతంగా ఒక మిలియన్ సంవత్సరాలు నివసించిన రెండు సమూహాల నుండి వచ్చినట్లు శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.

ఈ పరిశోధన మానవాళికి ఒక్క మూలం లేదని తేల్చి చెప్పేసింది. ప్రస్తుత ఆఫ్రికన్ జనాభా, దక్షిణాఫ్రికాలోని నామా సమూహం నుండి తీసుకొన్న జనాభా జన్యు డాటాను, అక్కడి పూర్వీక మానవుల జనాభాకు సంబంధించిన శిలాజ సాక్ష్యాధారాలతో పోల్చడం ద్వారా పరిశోధకులు మానవ పరిణామం కొత్త నమూనాను కనుగొన్నారు. దీనితో ఒకే ఆఫ్రికన్ జనాభా నుండి మానవులందరూ ఆవిర్భవించారని చెప్పే మునుపటి నమ్మకాలను ఈ పరిశోధన తారుమారు చేసింది. ప్రస్తుత ఆధునిక మానవుడు, మూలం లో వున్న మానవుడి మధ్య జన్యుభేదం 1-4% అని తేల్చారు. ప్రస్తుత శాస్త్రీయ పరిశోధనలు దీర్ఘకాల పరికల్పనకు అంటే కొన్ని యేండ్లకు పూర్వం ఇలా జరిగి ఉండవచ్చు అని చెప్పే విషయాలకు మద్దతు ఇవ్వలేదు అని తేల్చారు. మానవుని మూల జీవి ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

డా. మామిడాల ఇస్తారి
9848309231

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News