Saturday, December 21, 2024

యాంకర్ ప్రదీప్ ప్రేమ పెళ్లి?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యాంకర్ ప్రదీప్ ప్రేమ పెళ్లి చేసుకుంటున్నాడని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రదీప్ వయుసు సుమారు 36 ఏళ్లు ఉంటుంది. పెళ్లి ఎప్పుడు బాబు అంటే చాలా సార్లు మాటా దాటేశాడు. బుల్లి తెరపై యాంకర్లలో అమ్మాయిలదే హవా ఉండేది. ప్రదీప్ వచ్చిన తరువాత ట్రెడ్ సెట్ చేయడమే కాకుండా టాప్‌లో ఉన్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఏలా అనే సినిమాలో నటించి అందరిని మెప్పించాడు. జులాయి. అత్తారింటికి దారేది సినిమాలలో చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యాడు. ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారోతు అనే అమ్మాయిని ప్రదీప్ ప్రేమించాడని, త్వరలో ఆ జంట పెళ్లి చేసుకోబోతుందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రదీప్, నవ్య మతాలు వేరైనప్పటికి ఎప్పటి నుంచో ఇరు కుటుంబాలు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రదీప్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంటారా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా? అడగగా లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటామని చెప్పాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News