Wednesday, January 22, 2025

నెటిజన్ ట్వీట్‌పై ఘాటుగా స్పందించిన రష్మి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ నెటిజన్ చేసి ట్వీట్‌పై యాంకర్ రష్మి ఘాటుగా స్పందించారు. తాను ఇప్పటివరకు ఎలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయలేదని చురకలంటించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేసూ రష్మీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ఓ నెటిజన్ చేసిన కామెంట్ వైరల్‌గా మారింది. అసభ్యకర పనులు చేసి భగవంతుడి నామాన్ని జపిస్తే అవి తుడిచిపెట్టుకుపోతాయా? అని ప్రశ్నించారు. దీంతో తానేమైనా డబ్బులు ఎగ్గొట్టానా?… కుటుంబ బాధ్యత మరిచి తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేశానా?… ట్యాక్సులు చెల్లించడం లేదా?… ఏమైనా చట్ట విరుద్ధ పనులు చేశానా? అని ప్రశ్నించారు. సదరు నెటిజన్‌ను అసభ్యకరమైన పనులు ఏమిటి అని రష్మి నిలదీశారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కామెంట్లు బాగా వింటున్నానని చెప్పారు. తన వరకు భగవంతుడు సర్వాంతర్యామి అని, సనాతన ధర్మంలోని మంచి అదేనని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News