Sunday, April 20, 2025

అండగా నిలిచిన అందరికీ థాంక్స్.. యాంకర్ రష్మీ పోస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంతకు ముందు పలు సినిమాలు చేసి రాని గుర్తింపును.. టివి షోలతో సంపాదించుకుంది యాంకర్ రష్మి. తెలుగు పూర్తిగా రాకపోయినప్పటికీ.. ఆమె చేసే యాంకరింగ్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్‌మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. తాజాగా ఆమెకు సర్జరీ అయినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

‘నాకు ఇలాంటి క్లిష్ట పరిస్థతిలో అండగా నిలిచిన అందరికీ ఆమె థాంక్స్. ఐదు రోజుల్లోనే నా శరీరంలో హిమోగ్లోబిన్ శాతం 9కి పడిపోయింది. జనవరి నుంచి నాకు భుజం నొప్పి కారణంగా అకాల రక్తస్రావం జరుగుతూ వచ్చింది. అంతేకాక.. కొన్ని తెలియని సమస్యలు కూడా వచ్చాయి. మార్చి 29 వరకూ నేను పూర్తిగా నీరసించిపోయాను. అప్పటి వరకూ ఉన్న కమిట్‌మెంట్స్ అన్ని పూర్తి చేసుకున్నాను. ఏప్రిల్ 18న నాకు సర్జరీ జరిగింది. మరో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ ఫోటోలు ఆపరేషన్ ముందు తీసినవి. తర్వాత నా పరిస్థతి చాలా భయంకరంగా ఉంది. అసలు సమస్య ఫైబ్రాయిడ్లతో.. వాటిని వైద్యులు తొలగించారు’ అని రష్మి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News