Thursday, January 23, 2025

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: యాంకర్ శ్యామల

- Advertisement -
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: యాంకర్ శ్యామల


మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గండిపేటలోని తన నివాసంలో ప్రముఖ యాంకర్ శ్యామల శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ ఎంపి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చెట్ల గొప్పతనాన్ని తెలియజేస్తూ రూపొందించిన వృక్షవేదం పుస్తకం చాలా బాగుందని తనకు బహుకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం నితిన్, వెన్నెల కిషోర్, గీతా మాధురి ముగ్గురికి శ్యామల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News