Monday, December 23, 2024

యాంకర్ విష్ణుప్రియ తల్లి మృతి

- Advertisement -
- Advertisement -

 

యాంకర్ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కాలం చేశారు. గురువారం ఆమె తల్లి తుదిశ్వాస విడిచినట్లు విష్ణు ప్రియానే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. తన తల్లితో కలిసున్న ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్ విష్ణు ప్రియ ఎమోషనల్ అయ్యింది.
తన పోస్టులో మై డియర్ అమ్మ ఈ రోజు వరకు నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వు నా బలం, నువ్వే నా బలహీనత. ప్రస్తుతం నువ్వు ఈ అనంత విశ్వంలో కలిసిపోయావు. నువ్వు ప్రతిచోట, నా ప్రతి శ్వాసలో ఉంటావని నాకు తెలుసు. ఈ భూమి మీద నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. అందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అంటూ విష్ణుప్రియ పోస్టును షేర్ చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News