Saturday, April 5, 2025

తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శివలింగం

- Advertisement -
- Advertisement -

జ్యోతినగర్: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మూడవ డివిజన్ మేడిపల్లిలో పోచమ్మ గుడి ఆధునీకరణ కోసం తవ్వకాలు జరుపుతుంటే శివలింగం పీఠం పానిపట్టం బయటపడింది. శుక్రవారం ఉదయం మేడిపల్లి గ్రామంలో గల పురాతన పోచమ్మ తల్లి గుడిని ఆధునీకరించేందుకు స్థానిక కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, గ్రామ పెద్దలు కలిసి పోచమ్మ గుడి వద్ద తవ్వకాలు చేపట్టారు.

జెసిబితో తవ్వకాలు జరుపుతుంటే సుమారు 5 ఫీట్ల లోతులో శివలింగ పీఠం బయట పడింది. విషయం  తెలుసుకున్న గ్రామ పెద్దలు, కార్పొరేటర్ వెంటనే స్థానిక ఆలయ పూజారులను పిలిపించారు. బయటపడ్డ శివలిం పీఠంను శుద్ధి జరిపించి, వేద మంత్రాలతో పూజలు చేశారు. శ్రావణమాసం సందర్భంగా శివలింగ పీఠం వద్ద పూజలు నిర్వహిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News