Monday, December 23, 2024

ఇక ప్రతి ఏటా డీఎస్సీ

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆదివారం ఆయన శంఖారావం యాత్రను ప్రారంభిస్తూ మాట్లాడారు. టిడిపి పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చామని, కానీ జగన్ వచ్చి గంజాయి కేపిటల్ గా మార్చారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో జగన్ ఒక్కసారి కూడా డిఎస్సీ నిర్వహించలేదని, ఇప్పుడు కేవలం 6వేల పోస్టులతో నామమాత్రంగా నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేననీ, ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని లోకేశ్ చెప్పారు. సభలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ కూడా మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News