Monday, January 20, 2025

దుబాయ్‌లో గుండెపోటుతో శివసేన ఎమ్మెల్యే కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Andheri East MLA Ramesh Latke passed away

ముంబయి: ముంబయిలోని అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే దుబాయ్‌లో గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 52 సంవత్సరాలు. విహార యాత్ర నిమిత్తం తన కుటుంబంతో కలసి దుబాయ్ వెళ్లిన లట్కే బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించినట్లు శివసేన తెలిపింది. ఈ నియోజకవర్గం నుంచి ఆయన రెండవసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడానికి ముందు ఆయన బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని ముంబయి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు శివసేన తెలిపింది. లట్కే మృతి పట్ల శివసేన అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది సంతాపం తెలిపారు. కరోనా కాలంలో ఆయన ప్రజలకు అందచేసిన సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News