Sunday, February 23, 2025

ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన ఆంధ్రా బ్యాటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వంశీ కృష్ణా అనే బ్యాటరు ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాది రికార్డు సృష్టించాడు. కడపలో జరుగుతున్న జాతీయ స్థాయి టోర్నీ కల్నల్ సికె నాయుడు ట్రోఫీలో రైల్వేస్ జట్టు స్పిన్నర్ దమన్ సింగ్ ఓవర్‌లో ఆరు బంతుల్లో వంశీ కృష్ణా ఆరు సిక్స్‌లు బాదాడు. ఈ మ్యాచ్‌లో వంశీ 64 బంతుల్లో 110 పరుగులు చేశాడు. బిసిసిఐ తన ట్వీట్టర్‌లో ట్వీట్‌ను పోస్టు చేసింది. క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు సర్ గ్యారీ సోబర్స్ 1968 ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు రికార్డు సృష్టించాడు. 1985లో బరోడాపై ముంబయి తరపున ఆడుతున్న మాజీ టీమిండియా ఆటగాడు రవి శాస్త్రిపై ఆరు సిక్స్‌లు బాదిన రికార్డు ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌లో హర్షల్ గిబ్స్ ఆరు సిక్స్‌లు బాదగా 2007 తొలి టి20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాండ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఆరు సిక్స్‌లు బాది రికార్డు సృష్టించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News