Monday, December 23, 2024

వనితకు హోంశాఖ… రజినికి వైద్యం.. ముత్యాల నాయుడుకు పంచాయతీ రాజ్

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఎపి కొత్త మంత్రివర్గంలోకి మంత్రులకు ఆంధ్రప్రభుత్వం శాఖలను కేటాయించింది. 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం మంత్రివర్గంలోకి ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్‌ , సీదిరి అప్పలరాజు, తానేటి వనితలు రెండోసారి మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు.

తానేటి వనిత : హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ

బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (డిప్యూటీ సీఎం)

విడదల రజిని : వైద్యం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య

బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ

బుగ్గన రాజేంద్రనాథ్‌ : ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్‌ పీఆర్‌

దాడిశెట్టి రాజా : రోడ్లు, భవనాల శాఖ

ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌

సీదిరి అప్పలరాజు : పశుసంవర్థక, మత్స్య శాఖ

గుడివాడ అమర్‌నాథ్‌ : పరిశ్రమల శాఖ

గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ

జోగి రమేష్‌ : గృహనిర్మాణ శాఖ

కాకాణి గోవర్థన్‌రెడ్డి : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖ

కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ

అంబటి రాంబాబు : జలవనరుల శాఖ

ఆర్కే రోజా : టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ

ఆంజాద్‌ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)

ఆదిమూలపు సురేష్ ‌: మున్సిపల్‌ శాఖ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌

కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం)

నారాయణ స్వామి :  ఎక్సైజ్‌ శాఖ (డిప్యూటీ సీఎం)

ఉషాశ్రీ చరణ్‌ : స్త్రీ శిశు సంక్షేమ

మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ

పినిపే విశ్వరూప్‌ : రవాణా శాఖ

రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ(డిప్యూటీ సీఎం)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News