Tuesday, January 21, 2025

ఫిజియోథెరపిస్టును హత్యచేసిన లేడీ డాక్టర్ తండ్రి

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో అక్టబోర్ 29న ఒక ఫిజియోథెరిపిస్టును హత్య చేసిన ఆరీసీ ఉద్యోగిని గుంటూరు కొత్తపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గురువారం గుంటూరులో విలేకరుల సమావేశంలో స్ట్ సబ్ డివిజన్ ఎఎస్‌పి నచికేత్ షేల్కే కేసు వివరాలను తెలియచేశారు. మృతుడు సీతారామాంజనేయులు ఇక్కడి ఒక పైవేట్ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు. ఆయనకు వివాహమైనప్పటికీ కొంతకాలంగా గుంటూరువారితోటలోని ఇంట్లో ఒక్కరే నివసిస్తున్నారు.

అయితే ఇటీవల అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక లేడీ డాక్టర్‌తో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ విషయం తెలిసి ఆమె తండ్రి నరసరావుపేట ఆర్టీసీలో రీజినల్ సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న పి శ్రీనివాసరెడ్డి మనస్థాపం చెందాడు. తన కుమార్తె ఒక పెళ్లయిన వ్యక్తితో సన్నిహితంగా ఉండడం ఆయనకు నచ్చలేదు. పైచదువుల కోసం ఆయన తన కుమార్తెను విదేశాలకు పంపించివేశాడు. అయితే చదువును మధ్యలోనే ఆపివేసి సీతారాములుతో కలసి ఉండడానికి ఆయన కుమార్తె సిద్ధపడింది.

ఈ విషయం తెలిసి చదువును కొనసాగించాలనితన కుమార్తెకు ఆయన నచ్చచెప్పాడు. తన కుమార్తెతో సంబంధం పెట్టుకోవద్దని సీతారాంకు కూడా శ్రీనివాసరెడ్డి చెప్పాడు. అయితే సీతారాం నిరాకరించడంతో యనను చంపివేయాలని శ్రీనివాసరెడ్డి నిర్ణయించుకున్నాడు. అక్టోబర్ 29న సీతారాం ఇంటికి వెళ్లిన శ్రీనివాసరెడ్డి కళ్లలో కారం చల్లి సుత్తితో తలపై మోది హత్య పరారయ్యాడు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News