Monday, December 23, 2024

ఒక్కటైన అమెరికా అబ్బాయి.. ఆంధ్ర అమ్మాయి..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమకు ప్రాంతం, కుల, మత భాష భేదాలు ఏమీ ఉండవని చిత్తూరు అమ్మాయి, అమెరికా అబ్బాయి నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పలమనేరులోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో అమెరికాకు చెందిన అబ్బాయిని తెలుగు అమ్మాయి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. పెద్దపంజాణి మండల పరిషత్తు ఎఒ రేవూరి భాస్కర్, ఉపాధ్యాయురాలు సుమలత రెడ్డి దంపతులకు మీనా అనే కూతురు ఉంది. కూతురు ఇక్కడ ఇంజినీరింగ్ చేసి అమెరికాలోనే ఉంటున్నారు. ఆమె పని చేస్తున్న కంపెనీలో బ్రాడ్‌లీ టెర్రీతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో ఇరువైపులా కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు కలిసి కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ప్రేమపెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి ఇరు వైపులా బంధువులు వచ్చి ప్రేమ జంటను ఆశీర్వదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News