Monday, January 20, 2025

ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురు… రూ.100 కోట్ల పరువు నష్టం దావా

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురైంది. టిటిడి ప్రతిష్ట దిగజార్చడంతో సహా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అన్యమత ప్రచారం జరిగిందంటూ 2019లో ఆంధ్రజ్యోతి తప్పుడు కథనం రాసింది. దీంతో ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై తిరుపతి కోర్టులో రూ.100 కోట్ల పరువునష్టం దావా టిటిడి వేసింది. టిటిడి తరపున వాదనలు వినిపించేందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అనుమతి ఇవ్వాలని కోరుతూ టిటిడి అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. టిటిడి తరపున వాదనలు వినిపించేందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తిరుపతి కోర్టు అనుమతి ఇచ్చింది. తిరుపతి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆంధ్రజ్యోతి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆంధ్రజ్యోతి యాజమాన్యం పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తిరుపతి కోర్టు ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పులేదని హైకోర్టు తేల్చి చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News