Monday, December 23, 2024

90కిమీ. కొడుకు శవాన్ని మోటార్‌సైకిల్‌పై మోసుకెళ్ళిన పేద ఆంధ్రుడు!

- Advertisement -
Father carried son's body
హాస్పిటల్ వద్ద ఉన్న అంబులెన్స్ డ్రైవర్ రూ. 10 వేలు డిమాండ్ చేయడంతో…
తిరుపతి: ఇదో హృదయవిదారక ఉదంతం. తిరుపతిలోని గవర్నమెంటు ఆసుపత్రి వద్ద అంబులెన్స్ డ్రయివర్ పెద్ద మొత్తంలో (రూ.10,000) డబ్బు డిమాండ్ చేయడంతో అంత చెల్లించలేని ఓ పేద తండ్రి చివరికి మోటార్‌బైక్‌పైనే కొడుకు శవాన్ని 90కిమీ. తీసుకెళ్లాల్సి వచ్చింది. అతడు తిరుపతి నుంచి అన్నమయ్య జిల్లాలోని చిట్వేల్‌కు ద్విచక్రవాహనంపైనే శవాన్ని మోసుకెళ్లాల్సి వచ్చింది. ఓ పేద రైతు కుమారుడు జేస్వా సోమవారం రాత్రి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయాడు. అంబులెన్స్ డ్రయివర్ మానవత్వమే లేకుండా రూ. 10వేలు డిమాండ్ చేశాడు. దాంతో అతడు మోటార్ బైక్‌పైనే శవాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి అధికారులు అంబులెన్స్‌ను నడపడం ఆపేశారని వారంటున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలే జరిగాయని కూడా స్థానికులు అంటున్నారు. దాంతో ప్రైవేట్ అంబులెన్స్ ఆపరేటర్లు ప్రజలను ఇష్టమున్నట్లు లూటీ చేస్తున్నారు. కాగా ఆసుపత్రి ముందు టిడిపి, బిజెపి నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తు చేయడానికి వచ్చిన ఆర్‌డిఓను కూడా వారు అడ్డుకున్నారు. ఇదిలావుండగా దీనిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖండిస్తూ ట్వీట్ చేశారు. “ జేస్వా కోసం నా హృదయం నొచ్చుకుంది. అతడు తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కన్నుమూశాడు. అతడి తండ్రి ఆసుపత్రి అధికారులను ఎంతగా ప్రాధేయపడినప్పటికీ అంబులెన్స్ మాత్రం రాలేదు. దాంతో ప్రైవేట్ అంబులెన్స్ కోసం ప్రయత్నించగా అతడి శక్తికి మించిన మొత్తాన్ని డ్రయివర్ డిమాండ్ చేశాడు. దాంతో మోటార్‌సైకిల్‌పైనే 90 కిమీ. మేరకు శవాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆరోగ్య వసతులు అడుగంటుతున్నాయి” అని ట్వీట్‌లో నాయుడు పేర్కొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News