Sunday, December 22, 2024

నా చావుకు ముఖ్యమంత్రే కారణం… ఉపాధ్యాయుడు సూసైడ్ నోట్…

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిపిఎస్ రద్దు చేయలేదని ఆవేదనతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పెన్న అహోబిలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. చిన్న మస్తూరుకు చెందిన మల్లేష్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. తన చావుకు సిఎం జగనే కారణమని లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఉపాధ్యాయులను వైసిపి ప్రభుత్వం మోసం చేసిందని, సిపిఎస్ రద్దు చేయడంతో పాటు 5వ తేదీకల్లా జీతాలు ఇవ్వాలనేది తన చివరి కోరిక అని ఐదు పేజీల లేఖ రాశారు. సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పెన్నఅహోబిలం ఆలయం సమీపంలో విష పదార్థాలు మింగి ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. మల్లేష్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News