Wednesday, January 22, 2025

ముందే చంపేస్తామని బాలికపై గ్యాంగ్‌రేప్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలికపై అత్యాచారం చేశారు, తమ బండారం బయటపడుతుందనే అనుమానంతో బాలిక ఇంట్లోకి వెళ్లి ఆమెను చంపేసే ముందు మళ్లీ ఇద్దరు కలిసి సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గూడెంకొత్తవీది మండలంలో ఓ గ్రామంలో పాంగి రమేష్ (19) అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. అదే గ్రామంలో బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో ఆమె ఒంటరిగా ఇంట్లోనే ఉంది. ఇది గమనించిన రమేష్ ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు చెబుతుందని మరో ఆటో డ్రైవర్ సీతన్నతో కలిసి మళ్లీ ఆమె ఇంటికి వెళ్లారు. ఇద్దరు బాలికను చంపాలని నిర్ణయం తీసుకున్నారు.

చంపేముందు బాలికపై మళ్లీ అత్యాచారం చేసి గొంతునులిమి హత్య చేశారు. అనంతరం బాలిక మెడకు చున్నీ కట్టి ఉరేశారు. సాయంత్రి ఇంటికి వచ్చేసరికి బాలిక మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అంత్యక్రియల్లో భాగంగా స్నానం చేయిస్తుండగా బాలిక శరీరంపై గాయాలు కనిపించడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. కానీ మళ్లీ ఖననం చేశారు. అనుమానంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తమ పేర్లు బయటకు వస్తాయని తెలిసి విఆర్‌ఒ సాయంతో సీతన్న, రమేష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇద్దరు నిందితులపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News