Wednesday, January 22, 2025

బాపట్లలో ఆటోను ఢీకొట్టిన లారీ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుసుకుంది. అద్దంకి భవానీ కూడలి వద్ద ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:  శునకాల కోసం ఘర్షణ: కాల్పుల్లో ఇద్దరి మృతి(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News