Wednesday, January 22, 2025

అమెరికాలో రోడ్డుప్రమాదం: ఎపి విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్(22) బీటెక్ పూర్తి చేసి గత సంవత్సరం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. మాడిసన్ ప్రాంతంలోని డకౌట స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు స్నేహితులతో కలిసి తన మిత్రుడి పుట్టిన రోజుల వేడుకలకు కారులో బయలుదేరాడు. ఒక్కసారిగా పొగమంచు కమ్ముకోవడంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. రేవంత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు మిగిలిన ముగ్గురి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు. రేవంత్ కుటుంబ సభ్యులు శోకసంద్రలో మునిగిపోయారు. రేవంత్ తల్లి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోగా ఆయన తండ్రి అచంట రఘుబాబు ఫిజియోథెరపిస్టుగా సేవలందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News