Sunday, January 5, 2025

స్టార్టప్‌ఎన్ స్పేస్‌టెక్ పరీక్ష విజయవంతం

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ స్థావరంగా ఉన్న అంతరిక్షపరిశోధనకు సంబంధించిన స్టార్టప్ ఎన్ స్పేస్ టెక్ శుక్రవారం విజయవంతంగా పరీక్షను నిర్వహించింది. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన అల్ట్రా హై టెక్ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను తనస్వంత పేలోడ్ స్వేట్చ సాట్ పై ఇస్రో పోయెమ్ ప్లాట్‌ఫారం పై ఈ పరీక్షనిర్వహించ గలిగింది. ఇస్రో టెలిమెట్రీలో క్షేత్ర స్థాయి కేంద్రం వద్ద స్వేట్చసాట్ వి0 పంపించిన మొదటి జత డేటా ప్యాకేజీలను గ్రహించగలిగింది.

అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ (యుహెచ్‌ఎఫ్) కమ్యూనికేషన్ కచ్చితంగా గుర్తించడంలో తమ సామర్థాన్ని ఈ పరీక్ష నిరూపిస్తుందని ఎన్ స్పేస్ టెక్ సహ సంస్థాపకులు దివ్య కొతమాసు వెల్లడించారు. ఈ విజయం ఆధారంగా భవిష్యత్ మిషన్లకు అనుగుణంగా వేదికలను సిద్ధం చేస్తుందన్నారు. అనేక శాటిలైట్లను వేగంగా ప్రయోగించడానికి ఈ పరీక్ష మార్గం చూపిందని ఇస్రో మాజీ డైరెక్టర్ సుధీర్ కుమార్ ఎన్ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News