- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చెట్టిచెర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్ని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్ ఢీకొనడంతో బొలెరో వాహనం పెట్రోల్ ట్యాంకు పేలిపోయింది. బొలెరో వాహనం పెట్రోల్ ట్యాంకు పేలడంతో మంటలు చెలరేగాయి. మృతదేహాలను కంభం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు పాపాయిపల్లికి చెందినవారిగా గుర్తించారు. మృతులు రాహుల్(21), పవన్(21), శ్రీనివాసులు(20)గా గుర్తించారు.
- Advertisement -