Saturday, December 21, 2024

రెండు ట్రక్కులు, ఆర్టీసీ బస్సును దగ్ధం చేసిన మావోలు…

- Advertisement -
- Advertisement -

రాయ్ పూర్: చత్తీస్ గఢ్- ఆంధ్రప్రదేశ్ లోని సరిహద్దులోని చింతూరు మండలంలో బుధవారం రాత్రి ఆర్ టిసి బస్సుతో పాటు రెండు ట్రక్కులను దగ్ధం చేశారు. రాత్రి 7:30 గంటలకు జగదల్పూర్ నుండి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సును ఆసీర్ గూడెం గ్రామo వద్ద మావోయిస్టులు నిలిపివేసి దగ్ధం చేశారు. అలాగే మరో రెండు ట్రక్కులను డీజిల్ పోసి దగ్ధం చేశారు. చింతూరుకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. ఆశీర్వాదం గ్రామo వద్ద తాగు నీరు కోసం ప్రయాణికులు దిగిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుందని సమాచారం. ఈ సంఘటనలో ఎవరు చనిపోలేదని గాయపడలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News