Monday, December 23, 2024

ప్రియురాలికి వీడియో కాల్ చేసి… తండ్రిపై కర్రతో దాడి చేసిన కసాయి కొడుకు

- Advertisement -
- Advertisement -

అమరావతి: అక్రమ సంబంధానికి తండ్రి అడ్డుగా ఉండడంతో ప్రియురాలికి వీడియో కాల్ చేసి తండ్రిపై కసాయి కుమారుడు దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఢిల్లీ బాబు అనే వ్యక్తి హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి తనయుడు భరత్ (21) కూలీ పనులు చేసి చేదోడు వాదోడుగా తండ్రికి అండగా ఉంటున్నాడు. భరత్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తండ్రి అతడిని హెచ్చరించాడు. కానీ తండ్రి మాటలు పెడచెవిన పెట్టడంతో ప్రియురాలు పలుమార్లు కలవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు భరత్‌ను స్టేషన్‌కు పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇంటికి వచ్చిన తరువాత భరత్ తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి తండ్రిపై కర్రతో బాదాడు. అతడు తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిత్తూరు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News