బెట్టింగ్‌లో పాల్గొంటు అప్పుల పాలు
ఉద్యోగం పోగొట్టుకుని, భార్యతో కలిసి మోసాలు
వివాహం చేసుకుంటానని కోటి రూపాయలు తీసుకున్న దంపుతులు
అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: వివాహం చేసుకుంటానని నమ్మించి కోటి రూపాయలు తీసుకుని మోసం చేసిన దంపతులను నగర సిసిఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. ఎపిలోని గుంటూరు జిల్లా, సత్తెనపల్లికి చెందిన ఎర్రగుడ్ల దాసు, జ్యోతి దంపతులు. దాసు పండ్ల వ్యాపారం చేస్తుండగా, జ్యోతి ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. దాసు నూజివీడ్ ట్రిపుల్ ఐటిలో ఇంజనీరింగ్ చేశాడు. చదువు పూర్తి కాగానే టిసిఎస్‌లో ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉద్యోగంలో చేరాడు. ఆరు నెలలు పనిచేసిన దాసు తర్వాత ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడేందుకు బానిసగా మారాడు. దీంతో ఉద్యోగానికి సరిగా వెళ్లేవాడు కాదు, ఎన్నిసార్లు చెప్పిన మార్పు రాకపోడంతో టిసిఎస్ దాసును ఉద్యోగంలో నుంచి తీసివేశారు. దీంతో తన సొంతు ఊరు సత్తెనపల్లికి వెళ్లి నవంబర్, 2017లో జ్యోతిని వివాహం చేసుకున్నాడు. తర్వాత భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేశాడు.
2019లో సత్తెనపల్లికి వచ్చి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఆన్‌లైన్‌లో రమ్మీని ఎపి ప్రభుత్వ నిషేధం విధించడంతో క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే డబ్బులు సరిపోకపోవడంతో పలువురి వద్ద అప్పులు తీసుకున్నాడు. అయిన సరిపోకపోవడంతో తాను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కళ్యాణిశ్రీ పేరుతో ఓపెన్ చేసిన నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేశాడు. గతంలో కూడా యువతిగా చెప్పి పలువురు వ్యక్తులతో ఛాటింగ్ చేశాడు. నగరంలోని సికింద్రాబాద్‌కు చెందిన విజయ్ రెడ్డి చింతల మే,2020లో నిందితుడి ఫేస్‌బుక్ రిక్విస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు. అప్పటి నుంచి ఛాటింగ్ చేసుకునేవారు. లాక్‌డౌన్ సమయంలో నిందితుడికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. తనకు వారసత్వంగా వచ్చిన భూమిని తన సోదరుడు ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నాడని చెప్పాడు.
అది తన పేరుమీదకి వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటానని నమ్మించాడు. తనతో ఛాటింగ్ చేస్తున్న వారు యువతని నమ్మిన బాధితుడు కళ్యాణిశ్రీ(దాసు) తనకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉందని చెప్పాడు. దానిని నిజమని నమ్మిన బాధితుడు నిందితుడి భార్య బ్యాంక్ ఖాతాకు పలుమార్లు కోటి రూపాయలు పంపించాడు. డబ్బులో రూ.4లక్షలు పెట్టిన తన తండ్రి పేరుమీద భూమి, భార్యకు 10 నుంచి 12 తులాల బంగారం కొనుగోలు చేశాడు. మిగతా డబ్బులను క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత బాధితుడికి కళ్యాణిశ్రీ నుంచి ఎలాంటి రెస్పాండ్ రాకపోవడంతో నగర సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఛీటింగ్ చేసి దంపతులను అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ మధుసూదన్ రావు, ఎస్సైలు తదితరులు కేసు దర్యాప్తు చేశారు.