Sunday, January 19, 2025

ఇన్సురెన్స్ సొమ్ము కోసం మృతదేహాన్ని తగలబెట్టి….

- Advertisement -
- Advertisement -

అమరావతి: బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి చనిపోయినట్టు నటించి మరో వ్యక్తి మృతదేహాన్ని తీసుకొచ్చి తన చేనులో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. మృతదేహం సమీపంలో తన ఫోన్, చెప్పులను అక్కడే వదిలి వెళ్లిపోయాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వీరంపాలెంలో కేతమళ్ల వెంకటేశ్వర రావు అలియాస్ పూసయ్య అనే వ్యక్తి నివసిస్తున్నాడు. పూసయ్యకు అప్పులు ఎక్కువ కావడంతో ఎలా తీర్చాలని ప్రణాళిక వేశాడు. ప్లాన్‌లో భాగంగా తాను చనిపోతే రూ.40 లక్షలు బీమా సొమ్ము వస్తుందని అనుకున్నాడు. దీనిలో ఇద్దరు యువకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

మృతదేహాన్ని తీసుకొస్తే డబ్బులిస్తానని యువకులకు పూసయ్య ఆఫర్ ఇచ్చాడు. పాతబొమ్మూరులో ఇంజినీర్ నెల్లి విజయరాజు(55) మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న యువకులు శవ పేటిక నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పూసయ్య పొలంలోకి తీసుకెళ్లి తగలబెట్టారు. మృతదేహం వద్ద పూసయ్య చెప్పులు, సెల్‌ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్లిపోయారు. కాలిన మృతదేహం కనపడడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మృతదేహం పక్కన పూసయ్య సెల్‌ఫోన్, చెప్పులు ఉండడంతో అతడిదేనని గుర్తించారు. తన భర్త చనిపోవడంతో పూసయ్య భార్య శోకసంద్రంలో మునిగిపోయింది. తన భర్త లేని బతకు ఎందుకు అని పలుమార్లు రోధించడంతో పాటు చనిపోతానని చెప్పడంతో ఆ ఇద్దరు యువకులు భర్తకు సమాచారం ఇచ్చారు. రోషయ్య మరో ప్లాన్ వేశాడు. యువకులు భార్య దగ్గరికి వెళ్లి మీ పొలంలో ఎవరిదో మృతదేహం తగలబెడుతుండగా అడ్డుకున్నామని, కానీ వారు తమపై దాడి చేసి తుంపలో పడేశారని చెప్పారు. యువకుల శరీరంపై గాయాలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నారు. పూషయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News