Monday, January 20, 2025

అనుమానం… క్షణికావేశం… భార్యను చంపి… భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: అనుమానంతో భార్యను చంపి అనంతరం భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడిపుసావరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. కడియపుసావరం గ్రామంలో దూళ్ల సూరిబాబు(38), సత్యశ్రీ(34) అనే జంట 2008లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉంది. సూరబాబు కౌలు రైతుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య తరచుగా ఫోన్‌లో మాట్లాడుతుండడంతో ఆమెపై పలుమార్లు భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గ్రామంలో పెద్ద మనుషుల పలుమార్లు నచ్చజెపి కాపురం చేసుకోవాలని సూచించారు. సంక్రాంతి సమయంలో ఇద్దరు మధ్య గొడవ జరగడంతో తారాస్థాయికి చేరుకుంది. పుట్టింటికి వెళ్లిన భార్యను తన ఇంటికి రమ్మను పలుమార్లు భర్త కోరాడు. కాపురం చేయడానికి రమ్మని అత్తారింటికి అల్లుడు వెళ్లాడు. దంపతుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో గ్రాఫ్టింగ్ బ్లేడు తీసుకొని భార్య తలపై బాదడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. వెంటనే గ్రామ శివారులోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మారారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News