Sunday, December 22, 2024

అందరి చూపు ఆంధ్రప్రదేశ్‌ వైపే..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు ఒక లెక్కయితే, ఆంధప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు మరో లెక్క. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు, పార్టీల జయాపజయాలపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. మరికొన్ని గంటల వ్యవధిలో ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఏపిపైనే ఉంది. ప్రజల్లో నరాలు తెగే ఉత్కంఠ పెరుగుతున్న సమయంలో గెలుపోటములు ఎలా ఉంటాయోనని అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ ఒక్కరిని కదిపినా తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌సిపిల గెలుపు ఓటములపై ఎవరికి తోచిన లెక్క వారు చెబుతున్నారు. దీనికి తోడు బెట్టింగ్‌లతో ఎన్నికల ఫలితాల అంచనాలతో పందెం రాయుళ్లు ప్రతి రోజు టెన్షన్ పడుతున్నారు. ఉదయం టీ దుకాణం, టిఫిన్ చేసే హోటళ్లు, పది మంది ఎక్కడ కలిసినా, చివరికి నిద్రపోయే వరకు ఎపిలో గెలుపు ఎవరిదంటా..? అంటూ ఒకటే చర్చ. ఇతర రాష్ట్రాల్లో సెటిలైన తెలుగు వారు ఏపిలో వారికి ఫోన్లు చేసి ఏంటి పరిస్థితి అంటూ ఆరా తీస్తున్నారు. ప్రధాన సర్వే సంస్థలన్నీ తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన కూటమిదే విజయమని ప్రకటించడం, మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం వైఎస్‌ఆర్‌సిపిదే మళ్లీ అధికారం అని తేల్చడంతో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియక తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు.

ఎపిలో అధికారం ఎవరిదనే కోణంలో ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా భారత్‌తో పాటు విదేశాల్లో స్థిరపడిన వారు సైతం లెక్కలు మీద లెక్కలు, అంచనాల మీద అంచనాలు వేస్తున్నారు. విదేశాల నుంచి ఎంతోమంది ఏపికి వచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారు. ఈ పార్టీకే వేవ్ వన్ సైడే అని కొందరు బల్లగుద్ది చెబుతుంటే, కాదు ఆ పార్టీదే వార్ వన్ సైడ్ అంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. దీంతో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో గానీ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో గానీ పార్టీల జయాపజయాలపై ఇంత అనిశ్చితి, ఉత్కంఠ ఎదుర్కొనలేదు. ఇందుకు కారణం ఎక్కువ సార్లు ఆంధ్రప్రదేశ్‌ను తెలుగుదేశం పార్టీ ఏకఛత్రాదిపత్యంగా ఏలింది. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అప్పటికే అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని వైఎస్‌ఆర్‌సిపి క్షేత్రస్థాయి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించి 2019లో ఎవరూ ఊహించిన స్థాయిలో 151 స్థానాల్లో విజయం సాధించి, తెలుగుదేశం పార్టీని కేవలం 23 స్థానాలకు పరిమితం చేసింది. దీంతో ఆనాటి నుంచి నేటి వరకు ఎత్తుకు పైఎత్తు రాజకీయాలు కొనసాగుతుండగా, మరో వైపు ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, విద్యావంతులు, రాష్ట్రాన్ని అభివృధ్ది పథంలో చూడాలని కోరుకునే వారిలో నిరాశ, నిస్ప్రహ,

వ్యతిరేకత క్రమేణా పెరగడంతో వైఎస్‌ఆర్‌సిపిపై చాలా స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. అయితే ఎవరూ ఇప్పుడు గానీ, ఇంతకు ముందు గానీ ఇవ్వనంత డబ్బును నేరుగా సంక్షేమ పథకాల పేరుతో పేదల ఖాతాల్లో వేయడమే కాకుండా మహిళా ఓటర్ల మనసు గెలుచుకున్న వైసిపి ప్రభుత్వం గెలుపు మాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలు ఎవరి ధీమాలో అవి ఉన్నాయి. బిజెపి, జనసేనతో కలిసి టిడిపి కూటమికి ఈసారి భారీ ఓటింగ్ జరిగిందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చరిష్మా, పవన్ కళ్యాణ్ పాపులారిటీతో ఊహించిన దానికంటే టిడిపి నాయకత్వంలోని కూటమి విజయం సాధిస్తుందనే నమ్మకం మెజార్టీ వర్గాల్లో వినిపిస్తున్నందున, రానున్న ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. ఎగ్జిట్ పోల్స్ సర్వే తర్వాత ఒక్కసారిగా ఏపీలో సీన్ మొత్తం మారిపోయింది. ఇక ఎగ్జాక్ట్ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని ఎదురుచూస్తూ గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు చర్చల మీద చర్చలు చేస్తున్నారు. అమరావతిలో ‘చంద్రబాబు అనే నేను’ అంటూ ప్రమాణ స్వీకారం ఉంటుందని టిడిపి చెబుతుంటే, విశాఖపట్నం వేదికగా ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను’ అని ప్రమాణ స్వీకారం చేస్తారని వైసిపి చెప్పుకుంటోంది. ఈ ఇద్దరిలో ప్రమాణ స్వీకారం చేసేదెవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఏపీ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గెలుపు ధీమాలో టిడిపి కూటమి, వైసిపిలు
కాగా ఫలితాలపై తీవ్ర ఆసక్తి, ఉత్కంఠ కొనసాగుతుంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం ఫుల్ జోష్‌లో ఉంది. రెండు రోజుల ముందు అమరావతి చేరుకున్న చంద్రబాబు నాయుడును కలిసేందుకు వచ్చిన పార్టీ క్యాడర్, నాయకులంతా సిఎం, సిఎం అంటూ నినాదాలు చేశారు. కొందరు నేతలతే ‘కాబోయే సీఎం మీరే సార్’ అంటూ ముందస్తు శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఈ ఉత్సాహాన్ని చూసిన చంద్రబాబునాయుడు కూడా వారిని ఉద్దేశించి ‘సంబరాలు రేపు చేసుకుందాం.. ఎనర్జీని వృథా చేసుకోకండి’ అని పార్టీ శ్రేణులతో ముచ్చటించి వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఇదిలావుంటే వైసిపిలో మాత్రం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పితే కనీసం మీడియాతో మాట్లాడటానికి కూడా ఇతర నేతలు పెద్దగా బయటకు వచ్చి మాట్లాడిన వారు లేరు. వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, జోగి రమేష్ వంటి నాయకులు మళ్లీ జగన్‌దే అధికారం, ఎవరూ విజయాన్ని ఆపలేరని ఎగ్జిట్ పోల్ సర్వేల తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు. దీంతో ఫలితాలకు ముందే రాష్ట్రంలో తమ సీన్ ఏంటనేది వైసీపీకి అర్థమైందని ప్రచారం జరుగుతోంది.

ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమికే అధికారం దక్కబోతోందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్‌లో తాజాగా పేర్కొంది. దీని ప్రకారం 175 స్థానాల రాష్ట్ర అసెంబ్లీలో టిడిపి కూటమికి 98- నుంచి 120 వరకు లభించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 151 చోట్ల గెలిచిన వైసీపీ 55- నుంచి 75 సీట్లకే పరిమితమవుతుంది. కూటమిలో పార్టీల వారీగా విడిగా చూస్తే టీడీపీ అతి పెద్ద పార్టీగా అవతరించనుందని కూడా ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. టిడిపి ఒక్క దానికే 78 నుంచి -96 సీట్లు, జనసేనకు 16- నుంచి 18 సీట్లు, బీజేపీకి 4- నుంచి 6 సీట్లు దక్కుతాయని స్పష్టం చేశాయి. దీంతో టిడిపి నాయకత్వంలోని కూటమి విజయం ఖాయమనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాల్లో టిడిపి కూటమి విజయం సాధిస్తునే అంచనాలు ఎన్నికల నాటికే ఉండడంతో టిడిపి గత విజయం రిపీట్ అవుతుందని అంచనా పెరిగింది. ఇండియా టుడే సర్వే ప్రకారం వైసీపీకి కేవలం 55- నుంచి 77 సీట్లు వస్తాయని తేల్చింది. అంటే గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు రాగా, ఈసారి ఏకంగా 100 స్థానాలు తగ్గుతాయని సర్వే చెప్పడం గమనార్హం. వాస్తవానికి గత ఎన్నికల్లో ఇదే వైసీపీకి 119 నుంచి- 135 సీట్లు వస్తాయని ఇదే ఇండియా టుడే సర్వేనే చెప్పింది. ఇప్పుడు అదే సర్వేనే ఇంత ఘోరంగా వైసీపీ ఓడిపోతోందని చెప్పడంతో ఆ పార్టీ నేతలు అయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితి ఏపిలో కొనసాగుతున్న నేపథ్యంలో చూడాలి మరి సైకిల్ గాలి పోతుందా..?, లేక ఫ్యాన్ రెక్కలు విరిగిపోతాయో..?

ఎవరిదంటా..? అంటూ ఒకటే చర్చ. ఇతర రాష్ట్రాల్లో సెటిలైన తెలుగు వారు ఏపిలో వారికి ఫోన్లు చేసి ఏంటి పరిస్థితి అంటూ ఆరా తీస్తున్నారు. ప్రధాన సర్వే సంస్థలన్నీ తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన కూటమిదే విజయమని ప్రకటించడం, మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం వైఎస్‌ఆర్‌సిపిదే మళ్లీ అధికారం అని తేల్చడంతో ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియక తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. ఎపిలో అధికారం ఎవరిదనే కోణంలో ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా భారత్‌తో పాటు విదేశాల్లో స్థిరపడిన వారు సైతం లెక్కలు మీద లెక్కలు, అంచనాల మీద అంచనాలు వేస్తున్నారు.

విదేశాల నుంచి ఎంతోమంది ఏపికి వచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారు. ఈ పార్టీకే వేవ్ వన్ సైడే అని కొందరు బల్లగుద్ది చెబుతుంటే, కాదు ఆ పార్టీదే వార్ వన్ సైడ్ అంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. దీంతో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో గానీ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో గానీ పార్టీల జయాపజయాలపై ఇంత అనిశ్చితి, ఉత్కంఠ ఎదుర్కొనలేదు. ఇందుకు కారణం ఎక్కువ సార్లు ఆంధ్రప్రదేశ్‌ను తెలుగుదేశం పార్టీ ఏకఛత్రాదిపత్యంగా ఏలింది. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అప్పటికే అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని వైఎస్‌ఆర్‌సిపి క్షేత్రస్థాయి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించి 2019లో ఎవరూ ఊహించిన స్థాయిలో 151 స్థానాల్లో విజయం సాధించి, తెలుగుదేశం పార్టీని కేవలం 23 స్థానాలకు పరిమితం చేసింది. దీంతో ఆనాటి నుంచి నేటి వరకు ఎత్తుకు పైఎత్తు రాజకీయాలు కొనసాగుతుండగా, మరో వైపు ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, విద్యావంతులు,

రాష్ట్రాన్ని అభివృధ్ది పథంలో చూడాలని కోరుకునే వారిలో నిరాశ, నిస్ప్రహ, వ్యతిరేకత క్రమేణా పెరగడంతో వైఎస్‌ఆర్‌సిపిపై చాలా స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. అయితే ఎవరూ ఇప్పుడు గానీ, ఇంతకు ముందు గానీ ఇవ్వనంత డబ్బును నేరుగా సంక్షేమ పథకాల పేరుతో పేదల ఖాతాల్లో వేయడమే కాకుండా మహిళా ఓటర్ల మనసు గెలుచుకున్న వైసిపి ప్రభుత్వం గెలుపు మాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలు ఎవరి ధీమాలో అవి ఉన్నాయి. బిజెపి, జనసేనతో కలిసి టిడిపి కూటమికి ఈసారి భారీ ఓటింగ్ జరిగిందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చరిష్మా, పవన్ కళ్యాణ్ పాపులారిటీతో ఊహించిన దానికంటే టిడిపి నాయకత్వంలోని కూటమి విజయం సాధిస్తుందనే నమ్మకం మెజార్టీ వర్గాల్లో వినిపిస్తున్నందున, రానున్న ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. ఎగ్జిట్ పోల్స్ సర్వే తర్వాత ఒక్కసారిగా ఏపీలో సీన్ మొత్తం మారిపోయింది.

ఇక ఎగ్జాక్ట్ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని ఎదురుచూస్తూ గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు చర్చల మీద చర్చలు చేస్తున్నారు. అమరావతిలో ‘చంద్రబాబు అనే నేను’ అంటూ ప్రమాణ స్వీకారం ఉంటుందని టిడిపి చెబుతుంటే, విశాఖపట్నం వేదికగా ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను’ అని ప్రమాణ స్వీకారం చేస్తారని వైసిపి చెప్పుకుంటోంది. ఈ ఇద్దరిలో ప్రమాణ స్వీకారం చేసేదెవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఏపీ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గెలుపు ధీమాలో టిడిపి కూటమి, వైసిపిలు
కాగా ఫలితాలపై తీవ్ర ఆసక్తి, ఉత్కంఠ కొనసాగుతుంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం ఫుల్ జోష్‌లో ఉంది. రెండు రోజుల ముందు అమరావతి చేరుకున్న చంద్రబాబు నాయుడును కలిసేందుకు వచ్చిన పార్టీ క్యాడర్, నాయకులంతా సిఎం, సిఎం అంటూ నినాదాలు చేశారు. కొందరు నేతలతే ‘కాబోయే సీఎం మీరే సార్’ అంటూ ముందస్తు శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఈ ఉత్సాహాన్ని చూసిన చంద్రబాబునాయుడు కూడా వారిని ఉద్దేశించి ‘సంబరాలు రేపు చేసుకుందాం.. ఎనర్జీని వృథా చేసుకోకండి’ అని పార్టీ శ్రేణులతో ముచ్చటించి వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఇదిలావుంటే వైసిపిలో మాత్రం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పితే కనీసం మీడియాతో మాట్లాడటానికి కూడా ఇతర నేతలు పెద్దగా బయటకు వచ్చి మాట్లాడిన వారు లేరు. వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, జోగి రమేష్ వంటి నాయకులు మళ్లీ జగన్‌దే అధికారం, ఎవరూ విజయాన్ని ఆపలేరని ఎగ్జిట్ పోల్ సర్వేల తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు. దీంతో ఫలితాలకు ముందే రాష్ట్రంలో తమ సీన్ ఏంటనేది వైసీపీకి అర్థమైందని ప్రచారం జరుగుతోంది.

ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమికే అధికారం దక్కబోతోందని ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్‌లో తాజాగా పేర్కొంది. దీని ప్రకారం 175 స్థానాల రాష్ట్ర అసెంబ్లీలో టిడిపి కూటమికి 98- నుంచి 120 వరకు లభించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 151 చోట్ల గెలిచిన వైసీపీ 55- నుంచి 75 సీట్లకే పరిమితమవుతుంది. కూటమిలో పార్టీల వారీగా విడిగా చూస్తే టీడీపీ అతి పెద్ద పార్టీగా అవతరించనుందని కూడా ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. టిడిపి ఒక్క దానికే 78 నుంచి -96 సీట్లు, జనసేనకు 16- నుంచి 18 సీట్లు, బీజేపీకి 4- నుంచి 6 సీట్లు దక్కుతాయని స్పష్టం చేశాయి. దీంతో టిడిపి నాయకత్వంలోని కూటమి విజయం ఖాయమనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాల్లో టిడిపి కూటమి విజయం సాధిస్తునే అంచనాలు ఎన్నికల నాటికే ఉండడంతో టిడిపి గత విజయం రిపీట్ అవుతుందని అంచనా పెరిగింది. ఇండియా టుడే సర్వే ప్రకారం వైసీపీకి కేవలం 55- నుంచి 77 సీట్లు వస్తాయని తేల్చింది.

అంటే గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు రాగా, ఈసారి ఏకంగా 100 స్థానాలు తగ్గుతాయని సర్వే చెప్పడం గమనార్హం. వాస్తవానికి గత ఎన్నికల్లో ఇదే వైసీపీకి 119 నుంచి- 135 సీట్లు వస్తాయని ఇదే ఇండియా టుడే సర్వేనే చెప్పింది. ఇప్పుడు అదే సర్వేనే ఇంత ఘోరంగా వైసీపీ ఓడిపోతోందని చెప్పడంతో ఆ పార్టీ నేతలు అయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితి ఏపిలో కొనసాగుతున్న నేపథ్యంలో చూడాలి మరి సైకిల్ గాలి పోతుందా..?, లేక ఫ్యాన్ రెక్కలు విరిగిపోతాయో..?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News