Monday, December 23, 2024

ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

రెండు రోజులుగా కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తూండటంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. శుక్రవారం నాడు 18 జిల్లాలలో పరిస్థితిని సమీక్షించిన ఎన్నికల బృందం, శనివారం మరో 8 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ఎన్నికల బృందం ఆరా తీసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కూడా ఎన్నికల అధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది. ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ ఎన్నికల బృందం సూచనప్రాయంగా వెల్లడించింది. సమయం ఎక్కువగా లేనందున యుద్ధప్రాతిపదికన సన్నద్ధం కావాలంటూ కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది.

ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావాన్ని అరికట్టాలని ఎన్నికల బృందానికి నాయకత్వం వహించిన డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేయాలని, చెక్ పోస్టులపై ఒక కన్ను వేసి ఉంచాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News