Sunday, December 22, 2024

ఏలూరులో స్నేహితుడి భార్య గొంతు కోసి…. రైలు కిందపడి ప్రియుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రియుడిని ప్రియురాలు చంపి అనంతరం తాను రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జిల్లా కేంద్రంలోని వీధి అశోక్ చంద్ర ప్రాంతంలో ఓ మహిళ హత్యకు గురికావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ రూమ్‌లో గత కొన్ని నెలల నుంచి సత్యనారాయణ(40) అనే వ్యక్తి ఉంటున్నట్టు గుర్తించారు. సదరు మహిళ సుజాతగా గుర్తించారు. సుజాతతో(30) సత్యనారాయణ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. సుజాత భర్త సత్యనారాయణ స్నేహితులు.

Also Read: పురిట్లోనే చనిపోయిన బిడ్డ 42 ఏళ్ల తర్వాత తల్లిని కలిస్తే…

సదరు మహిళ భర్త లారీ డ్రైవర్ కావడంతో అతడు లేనప్పుడు ప్రియుడి వద్దనే ఉండేది. ప్రియుడు, ప్రియురాలు మధ్య మనస్పర్థలు రావడంతో ఆమెను ఇంటికి పిలిచి కత్తతో గొంతుకోసి చంపేశాడు. అనంతరం నూజివీడు రైల్వే స్టేషన్‌కు సమీపంలో రైలు కిందపడి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి చేతిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె గత కొంతకాలంగా దూరం పెడుతుండడంతో చంపేశానని వివరణ ఇచ్చాడు. ఆమెకు తాళి కూడా కట్టానని సూసైడ్ నోట్‌లో రాశాడు. సుజాతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలు భర్త భోపాల్‌లో ఉండడంతో అతడికి సమాచారం ఇచ్చారు. సత్యనారాయణకు కూడా గతంలో పెళ్లి జరిగిందని, భార్యతో విభేదాలు రావడంతో గత ఐదు సంవత్సరాల నుంచి అతడికి ఆమె దూరంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News