Monday, December 23, 2024

పిషరీస్ యూనివర్సిటీతో నర్సాపురం రూపురేఖలు మారుతాయి: జగన్

- Advertisement -
- Advertisement -

నర్సాపురం న్యూస్: ఈ అభివృద్ధి పనులతో నర్సాపురానికి ఎంతో మేలు జరుగుతుందని ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. నర్సాపురంలో జగన్ మాట్లాడారు. పాలకొల్లులో ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ పనులు ప్రారంభమయ్యాయని, వశిష్ట బ్రిడ్జి కోసం జనవరిలో టెండర్లు పిలుస్తామన్నారు. ఇంటింటికి అభివృద్ధి, మనిషి మనిషీకి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వివరించారు. ఒక్క బటన్‌తో నేడు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, రూ.3300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని, నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదన్నారు. నరసాపురానికి ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని జగన్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశామని, పిషరీస్ యూనివర్సిటీతో నర్సాపురం రూపురేఖలు మారుతాయని, ఫిషరీస్ వర్సిటీలు తమిళనాడు, కేరళలో మాత్రమే ఉన్నాయని, దేశంలోనే మూడో పిషరీస్ వర్సిటీ నరసాపురంలో రాబోతుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసుకున్నామని, ఒఎన్‌జిసి ద్వారా నష్టపోయిన 23458 మత్యకారుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని, 23 వేల మంది మత్యకారులకు రూ.107 పరిహారంగా అందించామని, గత ప్రభుత్వం ఏనాడు మత్సకారులను పట్టించుకోలేదని జగన్ ధ్వజమెత్తారు. వశిష్ట వారధి నిర్మాణానికి జనవరిలో టెండర్లు వేస్తామని, విజ్జేశ్వరం జలాశయం వద్ద గోదావని నీటిని శుద్ధి చేస్తామని పేర్కొన్నారు. పైప్‌లైన్ ద్వారా జిల్లా అంతటా మంచినీటిని అందిస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పి హామీల్లో 98 శాతం నెరవేర్చామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News