Monday, January 20, 2025

మహిళలను పురుషులతో సమన్యాయంగా అన్ని రంగాల్లో రాణించాలి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ గాండ్ల కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవాని
ఘనంగా అఖిల గాండ్ల తెలికుల రాష్ట్ర మహిళా సంఘం ప్రమాణ స్వీకారోత్సవం
అఖిల గాండ్ల తెలికుల రాష్ట్ర మహిళా సంఘం నూతన అధ్యక్షురాలుగా అన్నపూర్ణ

మన తెలంగాణ/హన్మకొండ టౌన్ :- సమాజంలో మహిళలు పురుషులతో పాటు సమన్యాయంగా అన్ని రంగాల్లో రాణించాలని ఆంధ్రప్రదేశ్ గాండ్ల కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవాని తెలిపారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన అఖిల గాండ్ల తెలికుల రాష్ట్ర మహిళా సంఘం ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమం ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డు లోని విష్ణుప్రియ గార్డెన్ లో నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గాండ్ల కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవాని  మాట్లాడారు. మహిళలు పురుషులతో సమానంగా రాణించినప్పుడే సమాజంలో గౌరవం దక్కుతుందన్నారు. మహిళలు ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. బొల్లెపల్లి భవాని చేస్తున్న సామాజిక, పరంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.

Also Read: భారతీయుల్లో భారతీయత కావాలి

బొల్లెపల్లి భవాని చేస్తున్న సామాజిక, సేవా కార్యక్రమాల వల్ల అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం జరిగిందని, అన్నపూర్ణ సంఘాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని సలహా ఇచ్చారు. అఖిల గాండ్ల తెలికుల రాష్ట్ర మహిళా సంఘం నూతన అధ్యక్షురాలు అన్నపూర్ణ మాట్లాడారు. అఖిల గాండ్ల తెలికుల సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికవడం సంతోషంగా ఉందని, గాండ్ల కులం అభివృద్ధికి తనవంతు సహాయం చేస్తానని, సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షురాలిగా బొల్లెపల్లి అన్నపూర్ణ కోటయ్య, ప్రధాన కార్యదర్శిగా బొల్లం సాహితి, కోశాధికారిగా పుష్పలతో పాటు పూర్తి కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో తెలంగాణ గాండ్ల తెలికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిక్కుమల రాంచంద్రయ్య, రాష్ట్ర ప్రధాన కారదర్శి కూతురు లక్ష్మణ్, నాయకులు బొల్లెపల్లి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News