Tuesday, November 19, 2024

కరోనా నుంచి కోలుకున్న ఎపి గవర్నర్

- Advertisement -
- Advertisement -

Andhra Pradesh Governor recovers from Covid-19

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని మంగళవారం నాడు ఎఐజి ఆసుపత్రి నుంచి డిశ్చార్ అయ్యారు. అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడలోని గవర్నర్ భవనానికి చేరుకున్నారు. కాగా కొవిడ్ బారిన పడ్డ ఎపి గవర్నర్ ఈనెల 17న హైదరాబాద్‌లోని ఎఐజి ఆస్పత్రి చేరారు. ఈ క్రమంలో ఎపి ప్రజల ఆశీస్సులు, వైద్య సేవల ఫలితంగానే కొవిడ్ నుంచి కోలుకున్నట్లు బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం ఎంతో మేలు చేసిందన్న ఆయన కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ అశ్రద్ధగా ఉండవద్దని ప్రజలకు సూచించారు.భౌతిక దూరం, మాస్కుల ద్వారా కరోనాను నియంత్రించవచ్చని, ముఖ్యంగా జనం రద్దీగా ఉండే ప్రాంతాలలో కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News