మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రా ష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వివాదం తా రాస్థాయికి చేరుకుంటోంది. సామరస్యంగా పరిష్కరించుకునేందుకు కేంద్ర ఏర్పాటుచేసిన కృష్ణా నదీ ట్రిబ్యూనల్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన సు ప్రీం ఫిబ్రవరి 13వ తేదీకి వాయిదావేసింది.
వెంటాడుతున్న జల వివాదాలు
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కృష్ణానదీ జలాల విభజనలో తెలంగాణకు కనీ సం యాబై శాతం నీటి కేటాయింపులు జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. అందుకు గల కారణాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా నదీ రివర్ బోర్డు కు తెలియజేసింది. దానిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం పరిష్కారానికి కేంద్ర ప్రభు త్వం చొరవ చూపుతున్నది. కృష్ణా ట్రైబ్యునల్ నీటి పంపకాల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం మెన్షన్ చేసింది. ట్రై బ్యునల్ ముందు దాఖలైన రెండు రిఫరెన్స్‌ల విచారణ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. కృష్ణా ట్రిబ్యునల్‌పై సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 13న విచార ణ జరగనుంది. 2023 అక్టోబర్ 23వ తే దీన విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇటీవల ఒక ని ర్ణయం తీసుకుంది.
విభజన చట్టం ప్రకారం నీటి వాటాల పంపకంపై రెండు రిఫరెన్స్‌ల ను ట్రిబ్యూనల్‌లో రెండు తెలుగు రాష్ట్రాలు దాఖలు చేశాయి.మహారాష్ట్ర, కర్నాటక, ఆం ధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాలు చేస్తూ ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించింది. అయితే2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవిభజన తర్వాత తలెత్తిన కృష్ణా నదీ నీ టి పంపకాలపై తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది. కృష్ణానది తమ భూభాగంలోనే ఎక్కువ ప్రవహిస్తుంది కాబట్టి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తమకు 70 శాతం నీటి వాటా కేటాయించాలని, సాధ్యం కానిపక్షంలో రెండు రాష్ట్రాలకు 50 శాతం చొప్పున అయినా నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనిపై ట్రిబ్యూనల్ తుది నిర్ణయం వెలువరించకముందే కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 10న నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్యనే నీటి పంపకాలను తేల్చాలని, దానిపైనే విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమ ముందు ఉన్న రెండు రిఫరెన్స్లలో 2023లో కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ రిఫరెన్స్ పైనే ముందుగా విచారణ చేపడుతామని ఈనెల 16న కృష్ణా ట్రైబ్యునల్ తేల్చి చెప్పింది. ట్రైబ్యునల్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది. ఫిబ్రవరి 19న ట్రైబ్యునల్ రెండు రిఫరెన్స్లనే విచారణకు తీసుకుంటామని చెప్పిన విషయాన్నిసుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తమ పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలని ఏపీ న్యాయవాదులు కోరారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తావనను జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌ల ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2గంటలకు తదుపరి విచారణను చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.