Thursday, January 23, 2025

‘ఎస్మా’కు భయపడం: అంగన్వాడీలు

- Advertisement -
- Advertisement -

తమ సమస్యల పరిష్కారం కోసం దాదాపు నెల రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ ఏక్ట్ (ఎస్మా) చట్టాన్ని ప్రయోగించింది. ఎస్మా చట్టం కింద సమ్మెను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్ వాడీలను అత్యవసర సర్వీసుల పరిధిలోకి తీసుకువస్తున్నట్లు పేర్కొంది. మరో ఆరు నెలల వరకూ సమ్మెలు, ఆందోళనలను ప్రభుత్వం నిషేధించింది. దాంతోపాటు సమ్మె కాలానికి అంగన్ వాడీ కార్మికులు, హెల్పర్ల వేతనాలలో కోత విధించింది.

ఎస్మా ప్రయోగం పట్ల అంగన్ వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించేంతవరకూ సమ్మె కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని వారు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News