Monday, January 20, 2025

డెడ్ స్టోరేజీ నీటితో పోలవరం ఎత్తిపోతల

- Advertisement -
- Advertisement -

గోదావరి బోర్డుకు రాష్ట్రం ఫిర్యాదు.. ఆపించాలని విజ్ఞప్తి

మన తెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నుంచి డెడ్‌స్ట్టోరేజిని సైతం వినియోగించుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకాలను వెంటనే నిలిపి వేయించాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదీయాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. జలాశయాల్లో అడుగున మిగిలిపోయే డెడ్‌స్టోరేజి నీటికోసం ఎత్తిపోతల పథకాలు నిర్మించటం సరైనది కాదని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్‌సింగ్‌కు సోమవారం నాడు లేఖ రాశారు. ఎపి ప్రభుత్వ చర్యల వల్ల గోదావరి డెల్టా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో చేపట్టే ప్రాజెక్టులపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతున్న విషయాన్ని కూడా ఈ లేఖలో ఈఎన్సీ గుర్తుచేశారు. ఒకవైపు తెలంగాణ ప్రభు త్వం చేపట్టే ప్రాజెక్టులకు అభ్యంతరాలు చెబుతూ, మరోవైపున పోలవరం డెడ్‌స్టోరేజీ కింద మిగిలిపోయే గోదావరి దీ జలాలను కూడా వినియోగించుకునేందుకు ఎపి ప్రభుత్వం చేపట్టిన ఇటువంటి చర్యలేమిటని ప్రశ్నించారు. దీని పై గోదావరి బోర్డు చర్యలు తీసుకోవాల ని కోరారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగానే చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా ఈఎన్సీ మురళీధర్ గో దావరి బోర్డు చైర్మన్‌ను కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News