గత వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం, అదానీ గ్రూప్‌ల మధ్య జరిగిన లంచాల కుంభకోణానికి సంబంధించి అమెరికాలో దాఖలు చేసిన చార్జిషీట్ నివేదికలు ఏపి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు శుక్రవారం తెలిపారు.
అదానీ గ్రూప్ నుంచి ప్రభుత్వ అధికారులు లంచాలు అందుకున్నారనే ఆరోపణలతో గత వైఎస్సార్‌సిపి హయాం స్కామ్‌లో చిక్కుకుంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ, ఆ ఆరోపణలపై తమ ప్రభుత్వం అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
‘‘అమెరికాలో దాఖలు చేసిని అభియోగా పత్రాల నివేదికలు నా వద్ద ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్ లో కూడా ఉన్నాయి.దానిని అధ్యయనం చేశాక చర్యలు చేపడతాము, మీకు కూడా తెలుపుతాము’’ అని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇదిలావుండగా వైఎస్ ఆర్ సిపి గురువారం తమ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేసింది. అదానీ గ్రూప్ తో నేరుగా ఒప్పందం ఏది చేసుకోలేదని తెలిపింది. మాజీ సిఎం జగన్‌మోహన్ రెడ్డిపై ఆరోపణలు రుజువైతే, ఆయనే బాధ్యత వహించాలని కొందరు సభ్యులు సభలో కోరారు.