Sunday, December 22, 2024

భార్యను కత్తితో 12 సార్లు పొడిచి…. భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: అనుమానంతో భార్యను చంపి అనంతరం అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడివాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…భీమవరానికి చెందిన సూర్యనారాయణకు గుడివాడకు చెందిన రామలక్ష్మితో ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు. గత సంవత్సరం నుంచి తన భార్యపై అనుమానం కలగడంతో ఆమెను వేధించడంతో పాటు పలుమార్లు ఆమెపై దాడి చేశాడు. పంచాయతీ పెద్ద మనషులు వద్దకు చేరడంతో కాపురం చేయాలని దంపతులకు నచ్చజెప్పారు. భర్తలో మార్పురాకపోవడంతో పాటు రోజు రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడిపై భార్య ఫిర్యాదు చేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది.

రామలక్ష్మి కుటుంబ సభ్యులు ఆదివారం పనులకు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని తెలుసుకొని సూర్యనారాయణ అక్కడికి చేరుకొని భార్యను కత్తితో 12 సార్లు పొడిచాడు. కూతురు కేకలు విన్న తండ్రి వచ్చి చంపొద్దంటూ అడ్డుగా వచ్చాడు. మామపై కూడా అల్లుడు కత్తితో దాడి చేశాడు. భార్య చంక కింద భాగంలో పొడవడంతో ఆమె కిందపడిపోయింది. వెంటనే అతడు పురుగుల మందు తాగి కిందపడిపోయాడు. ముగ్గురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. భార్య, భర్త ఇద్దరు చనిపోయారు. మామ తీవ్రంగా గాయపడడంతో చికిత్స పొందుతున్నాడు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News