Monday, December 23, 2024

హైదరాబాద్ నుంచి పారిపోయిన జంట… ఆంధ్రాలో కూతురును చంపిన కసాయి తల్లి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రియుడి మోజులో పడి ఆరేళ్ల కూతురిని తల్లి కర్కశంగా చంపేసి మృతదేహాన్ని ముళ్లపొదలో పడేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌లో లాలాగూడాలో స్వప్న వివాహిత నివస్తోంది. స్వప్నకు ఆరేళ్ల కూతురు నేహా ఉంది. హైదరాబాదలో కర్నూలు జిల్లాకు చెంది కౌతాళం సిద్ధార్థ కూలీ పనులు చేసేవాడు. స్వప్నకు కౌతాళంతో పరిచయం ఏర్పడడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. స్వప్న పాపను తీసుకొని కౌతాళంతో పారిపోయింది. స్వప్న అత్తింటివారు లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నెల రోజుల క్రితం తాడికొండ మండలం బండారుపల్లిలో గుడారం ఏర్పాటు చేసుకొని ప్రియుడు, ప్రియురాలు మిర్చి పనులకు వెళ్తున్నారు. ప్రియుడు, ప్రియురాలు ఏకాంతానికి పాప అడ్డుగా ఉండడంతో చంపాలని నిర్ణయం తీసుకున్నారు. నేహా తలపై రాయితో కొట్టి చంపేసి అనంతరం మృతదేహాన్ని బండారుపల్లి శివారులోని రైల్వే ట్రాక్ వద్ద ముళ్ల కంపలో పడేసి దహనం చేశారు. ముళ్ల కంపలో కాలిపోయిన మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే లాలాగూడ పోలీసులు సమాచారం తెలియడంతో ఆ గ్రామానికి చేరుకున్నారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News