Saturday, December 21, 2024

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం… ఎపి హైకోర్టు జడ్జి జస్టిస్ సుజాతకు తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్‌ వడ్డిబోయిన సుజాత  గాయపడ్డారు. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో సూర్యాపేట-కోదాడ మధ్య చివ్వెంల మండలంలోని తిరుమలగిరి శివారులో నేషనల్ హైవే 65పై వర్షం కారణంగా టైర్లు జారీ అదుపుతప్పి బోల్తా పడింది.  ఈ ప్రమాదంలో సుజాత తీవ్రంగా గాయపడడంతో సూర్యాపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె తలకు గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించారు. సుజాతను మంత్రి జగదీశ్ రెడ్డి పరామర్శించడంతో పాటు తన కాన్వాయ్ లో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. హైకోర్టు జడ్జి సుజాత హైదరాబాద్‌ నుంచి విజయవాడకు కారులో నిన్న సాయంత్రం సమయంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గన్ మెన్, డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News