Friday, December 20, 2024

ఎపిలో మహిళపై అత్యాచారం… మార్కెట్‌లో కళ్లప్పగించి చూశారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: మార్కెట్‌లో అందరూ చూస్తుండగానే షెడ్‌లోకి లాక్కెళ్లి మహిళపై అత్యాచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంఘటన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో జరిగింది. ఓ మహిళను దుండగులు కోటనందూరు మెయిన్ రోడ్డులో ఉన్న మార్కెట్‌కు తీసుకొచ్చారు. ఆ పక్కనే ఉన్న షెడ్‌లోకి లాక్కెళ్లి దుండగులలో ఒకడు ఆమెపై అత్యాచారం చేశాడు. స్థానికులు అందరూ అక్కడ ఉన్న ఎవరు కూడా స్పందించలేదు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. మహిళపై అత్యాచారం చేస్తుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. సదరు మహిళకు మతిస్థిమితం లేదని స్థానికులు తెలిపారు. దుండగులు మద్యం, గంజాయి మత్తులో ఉన్నట్టు సమాచారం. వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెపై అత్యాచారం చేసిన తరువాత ఎక్కడికి తీసుకెళ్లారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

Also Read: వరల్డ్ టాప్ స్మార్ట్ సిటీస్ జాబితాలో హైదరాబాద్ ఎక్కడుందంటే…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News